Education12th Mar 06:19 PMSunil Byrisetty1 min read

అగ్నివీర్ కోసం దళారులను నమ్మి డబ్బు చెల్లించొద్దు

ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం

అగ్నివీర్ కోసం దళారులను నమ్మి డబ్బు చెల్లించొద్దు
ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10 ఏప్రిల్ 2025. ఒక అభ్యర్థి ఇప్పుడు రెండు వేర్వేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ) మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో నిర్వహించబడుతోంది. అదనంగా, 1.6 కిలోమీటర్ల పరుగు సమయాన్ని 06 నిమిషాలు 15 సెకన్లకు పెంచడం జరిగింది. అన్ని కేటగిరీలకు సంబంధించిన ఎన్‌సీసీ 'ఎ', 'బి' & 'సి' సర్టిఫికెట్ కలిగిన వారికి మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులకు, అలాగే అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ కోసం ఐటిఐ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు అదనపు మార్కులు కూడా ఇవ్వబడతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పలనాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ కార్యాలయ సహాయకులు/స్టోర్ కీపర్ టెక్నికల్ మరియు అగ్నివీర్ వృత్తి నిపుణుల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. కావున, అగ్నివీర్‌గా సైన్యంలో నియామకం కోసం దళారులకు డబ్బులు చెల్లించవద్దు.
Education
Agniveer Army Recruitment
Guntur
ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్
గుంటూరు
Scroll for the next article