News17th Sep 04:07 PMSunil Byrisetty1 min read

సెర్ప్, అలీప్ మధ్య ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లోని 35 మంది బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కు RAMP పథకం కింద శిక్షణ పూర్తయినట్లు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ALEAP ఇండస్ట్రియ

సెర్ప్, అలీప్ మధ్య ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లోని 35 మంది బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కు RAMP పథకం కింద శిక్షణ పూర్తయినట్లు ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ALEAP ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు అందజేశారు. ALEAP సంస్థ 30 ఏళ్లుగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని మంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ALEAP పనిచేస్తోంది అని తెలిపారు. SERP, ALEAP మధ్య BDSPsపై కుదిరిన ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Andhra Pradesh
SERP
ALEAP
Women Entrepreneurs
MSME
RAMP
Business Development
BDSP
Industrial Growth
Skill Training
Entrepreneurship
సర్టిఫికెట్ పంపిణీ
మహిళా సాధికారత
ఏపీ ప్రభుత్వం
ఆర్థికాభివృద్ధి
Scroll for the next article