News9th Oct 10:16 AMSunil Byrisetty1 min read
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లకు అలర్ట్
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, లబ్దిదారులు మరియు ఏజెంట్లకు న్యాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల బృందం నిర్ణయం మేరకు, అగ్రిగోల్డ్ బాండ్లు, సంబంధిత పత్
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, లబ్దిదారులు మరియు ఏజెంట్లకు న్యాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రుల బృందం నిర్ణయం మేరకు, అగ్రిగోల్డ్ బాండ్లు, సంబంధిత పత్రాల పరిశీలన, నమోదు ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా C.I.D డీజీపీ గారి ఆదేశాల మేరకు, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కార్యాలయంలో నేటి నుంచి ప్రత్యేక అగ్రిగోల్డ్ బాండ్ పరిశీలన జరుగుతోంది. డిపాజిటర్లు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు సంబంధిత ఒరిజినల్ బాండ్లను పరిశీలన కోసం తప్పనిసరిగా తీసుకురావాలని పోలీసులు సూచించారు. స్వీయ సంతకం చేసిన వాటి కలర్ జిరాక్స్ ప్రతులను సమర్పించి రసీదు పొందాలని తెలిపారు. ఒరిజినల్ బాండ్లు పరిశీలన కోసం మాత్రమే చూపించాలన్నారు. వాటిని అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని సూచించారు.
మండలాల వారీగా బాండ్లు స్వీకరణ షెడ్యూల్ :
1. 09.10.2026 & 10.10.2026 తేదిలలో రెడ్డిగూడెం మండలం
2. 12.10.2026 & 13.10.2026 తేదిలలో A కొండూరు మండలం
3. 14.10.2026 & 15.10.2026 తేదిలలో గంపలగూడెం మండలం
4. 16.10.2026 & 17.10.2026 తేదిలలో G కొండూరు మండలం