News11th Jul 04:58 PMSunil Byrisetty1 min read

నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన

నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సం

నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన
నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్రపరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి అంతా ప్రాధాన్యత ఇవ్వాలని, వచ్చే ఏడాదికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లే లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు తాము చూసిన యంత్రాల్లో అవసరమైనవాటిని ఎంపిక చేసుకోవచ్చని, వీటిపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Andhra Pradesh news
narsipatnam
agricultural mechanization
Ayyannapatrudu
farmers
agricultural machinery installed
నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన
Scroll for the next article