News26th Nov 04:21 PMSunil Byrisetty1 min read

తుఫాను ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు

రానున్న తుఫాను కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ న

తుఫాను ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు
రానున్న తుఫాను కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బుధవారం ఉదయం మంత్రివర్యులు మొవ్వ మండలం కారకంబాడు గ్రామ పర్యటన సందర్భంగా మార్గమధ్యలో పామర్రు సెంటరు నుండి గుడివాడ వెళ్లే రహదారిలో రైతులు ఒకవైపు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి ధాన్యం కొనుగోలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలులో తాము ఇబ్బందులు పడుతున్నామని, రైతులు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. అంతేకాకుండా రంగు మారిన ధాన్యం మిల్లర్లు తీసుకోవడం లేదని, ఆ ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా తగిన సహాయం చేయాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో సెల్ఫోన్లో మాట్లాడుతూ రానున్న తుఫాను వలన రైతులకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Andhra Pradesh
Farmers
Paddy Procurement
Cyclone
Minister Kolusu Parthasarathy
District Collector
Millers
జిల్లా కలెక్టర్
మిల్లర్లు
వ్యవసాయం
పంట రక్షణ
రైతు సమస్యలు
Scroll for the next article