International10th Sep 05:03 PMSunil Byrisetty1 min read

AI ముప్పా లేక తప్పా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడి పనిని తేలిక చేసేందుకు కనిపెట్టింది. అయితే ఒక స్థాయికి మించిన పరిశోధనలు, మానవ మేథను దాటి చేసే ఆలోచనలు ముప్పుగా పరిణమిస్తాయని రుజువవుతోంది. మనిషి ఆల

AI ముప్పా లేక తప్పా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడి పనిని తేలిక చేసేందుకు కనిపెట్టింది. అయితే ఒక స్థాయికి మించిన పరిశోధనలు, మానవ మేథను దాటి చేసే ఆలోచనలు ముప్పుగా పరిణమిస్తాయని రుజువవుతోంది. మనిషి ఆలోచించి చేయాల్సిన పనులను ఆలోచించడం మానేసి ఆధారపడటం తప్పవుతుంది. ఏంథ్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఓ సంచలన హెచ్చరిక చేశారు. AI ల్యాబ్‌లు తమను తాము మరింత మెరుగుపరుచుకునే సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా పరుగులు తీస్తున్నాయని, ఈ క్రమంలో “మన ప్రాణాలతో జూదం ఆడుతున్నారని” ఆయన హెచ్చరించారు. ఆయన పోస్ట్‌కు ఇప్పటికే 140 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో AI ఇండస్ట్రీ లోపల నుంచి వచ్చిన ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతలో ఏంథ్రోపిక్‌లోనే పనిచేస్తున్న మరో పరిశోధకుడు ఇవాన్ హ్యూబింగర్ చేసిన వ్యాఖ్యలు మరింత కలవరపెట్టాయి. “AI వల్ల మనుషులందరూ చనిపోయే అవకాశం ఉందని మేము నిజంగానే నమ్ముతున్నామని” ఆయన అన్నారు. అంతేకాదు, వచ్చే దశాబ్దంలోనే ఆ ప్రమాదం 10% కంటే ఎక్కువ అవకాశం ఉందనేది తన వ్యక్తిగత అంచనా అని చెప్పారు. మొత్తంగా ఏఐ వినియోగం, దానిపై పరిశోధనలు ఒక స్థాయి దాటితే వినాశనానికే దారి తీస్తాయి.
Technology News
Artificial Intelligence
AI Risks
AI Threat
AI Safety
Superintelligence
Anthropic
Jacob Coxon
Ivan Huebinger
AI Research
AI Technology
AI Ethics
Future of AI
AI Development
Human Intelligence
Scroll for the next article