Technology13th Sep 05:43 PMSunil Byrisetty1 min read
ఏఐ స్పీడుకు బ్రేకేయాల్సిందే!
హద్దుల్లేని కృత్రిమ మేథ అభివృద్ధి క్రమంగా ముప్పుగా పరిణమిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగంపై ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఐ సాంకేతికత అభివృద్
హద్దుల్లేని కృత్రిమ మేథ అభివృద్ధి క్రమంగా ముప్పుగా పరిణమిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగంపై ప్రపంచ టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఐ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, లేదంటే మానవాళికి ముప్పు తప్పదని ప్రముఖ కంపెనీ ఆంత్రోపిక్ సీఈఓ డేరియో అమొడెయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఇంటర్నెట్ను ఎఐ తన ఆధీనంలోకి తీసుకోగలదని ఆయన హెచ్చరించారు. డేరియో ప్రతిపాదనను ఓపెన్ ఎఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమర్థించారు. ఎఐ భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసి, ఆ తర్వాత అత్యంత శక్తిమంతమైన మోడళ్ల అభివృద్ధిని కొనసాగించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని వీరి ముగ్గురు అభిప్రాయపడ్డారు. ఎఐ ఎంత ఉపయోగమో అంత ప్రమాదకరమనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.