Education31st Oct 01:15 PMSunil Byrisetty1 min read
3వ తరగతి నుంచే ఏఐ బోధన
ప్రపంచంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని బోధనలోనూ మార్పులొస్తున్నాయి. దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థ
ప్రపంచంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని బోధనలోనూ మార్పులొస్తున్నాయి. దేశవ్యాప్తంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటేషనల్ థింకింగ్ (సీటీ) పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఏఐని నైతికంగా వినియోగించడం, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించడం గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ కార్తీక్ రామన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటైంది. డిసెంబర్ నాటికి పాఠ్యాంశాల రూపకల్పన పూర్తి చేయనున్నారు.