Mobiles15th Jul 02:03 PMSunil Byrisetty1 min read

రూ.4,999కే 5G ఫోన్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి భారత బ్రాండ్ ‘AI+’

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో దేశీయ బ్రాండ్ అడుగుపెట్టింది. భారత బ్రాండ్ ‘ఏఐ+’ ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ ఇండియా, హానర్ సంస్థల మాజీ సీఈఓ మాధవ్ సేథ్, ‘నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్న

రూ.4,999కే 5G ఫోన్.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి భారత బ్రాండ్ ‘AI+’
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో దేశీయ బ్రాండ్ అడుగుపెట్టింది. భారత బ్రాండ్ ‘ఏఐ+’ ఎంట్రీ ఇచ్చింది. రియల్‌మీ ఇండియా, హానర్ సంస్థల మాజీ సీఈఓ మాధవ్ సేథ్, ‘నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్’ అనే స్టార్టప్‌ను స్థాపించి, ‘AI+’ అనే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ కింద AI+ Pulse (4G), AI+ Nova (5G) అనే రెండు మోడల్స్‌ను పరిచయం చేశారు. భారత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు. 5జీ మోడల్ కేవలం రూ.7,999 నుంచి ప్రారంభమవుతోంది. AI+ Pulse (4G) ధరలు: 4GB RAM + 64GB స్టోరేజ్ – ₹4,999 6GB RAM + 128GB స్టోరేజ్ – ₹6,999 AI+ Nova (5G) ధరలు: 6GB RAM + 128GB స్టోరేజ్ – ₹7,999 8GB RAM + 128GB స్టోరేజ్ – ₹9,999 డిస్‌ప్లే: 6.7 అంగుళాల HD+ స్క్రీన్, 50MP ప్రధాన కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో AI+ Pulse (4G) లో Unisoc T615 ప్రాసెసర్, AI+ Nova (5G) లో Unisoc T8200 ప్రాసెసర్ లతో వచ్చాయి. ఈ రెండూ Android 15 ఆధారిత NX-TQ OS పై రన్ అవుతాయి.
Smart mobiles
domestic brand
Al+ Pulse mobile
Quantum Shift Technologies
Scroll for the next article