Crime10th Oct 09:11 AMSunil Byrisetty1 min read

చంద్రబాబు పేరుతో ఏఐ కాల్స్!

ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పలువురి వద్ద డబ్బులు తీసుకొని ఘరానా మోసాలకు పాల్పడ్డారు. నిజమని

చంద్రబాబు పేరుతో ఏఐ కాల్స్!
ఏఐ సహాయంతో చంద్రబాబు, దేవినేని ఉమ మొహాలతో తెలంగాణ టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పలువురి వద్ద డబ్బులు తీసుకొని ఘరానా మోసాలకు పాల్పడ్డారు. నిజమని నమ్మి చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వెళ్లి, 18 మంది తెలంగాణ టీడీపీ నాయకులు మోసపోయామని గ్రహించారు. నాయకులను మోసం చేసింది ఏలూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు దేవినేని ఉమ పీఏ పేరుతో ఫోన్ చేసి, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పిన దుండగుడు. కాసేపటికి దేవినేని ఉమ మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి, టీడీపీ కార్యకర్తల పిల్లల చదువుకు సహాయం చేయాలని, మూడు ఫోన్ పే నంబర్లకు డబ్బు పంపాలని చెప్పాడు. దీంతో రూ.35 వేలు డబ్బును పంపి మోసపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని, చంద్రబాబు వీడియో కాల్ చేస్తారని, కాసేపటికి చంద్రబాబు మొహంతో పోలిన వ్యక్తి వీడియో కాల్ చేసి మళ్ళీ మోసం చేశారు. సరేనని విజయవాడ వచ్చి లబోదిబోమన్నారు ఆ తెలంగాణ టీడీపీ నేతలు.
AndhraPradesh news
Telangana TDP
Chandrababu Naidu
Devineni Uma
AI scam
fake video call
cyber fraud
Telugu politics
Vijayawada
Khammam
Eluru
ఏఐ మోసం
నకిలీ వీడియో కాల్
సైబర్ మోసం
Scroll for the next article