Crime15th Sep 04:46 PMSunil Byrisetty1 min read

దొంగని పట్టించిన 1980’స్ ట్రెండ్

ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం దొంగతనానికి పాల్పడిన దొంగని 1980’స్ ట్రెండ్ పట్టించింది. ఓ చిన్న జువెలరీ షాపులో ఓ యువతి బంగారు హారం కొట్టేసి మాయమైన ఘటనలో యజమాని వెతికి వేసారిపోయాడు. పోలీ

దొంగని పట్టించిన 1980’స్ ట్రెండ్
ఉజ్జయినిలో 45 ఏళ్ల క్రితం దొంగతనానికి పాల్పడిన దొంగని 1980’స్ ట్రెండ్ పట్టించింది. ఓ చిన్న జువెలరీ షాపులో ఓ యువతి బంగారు హారం కొట్టేసి మాయమైన ఘటనలో యజమాని వెతికి వేసారిపోయాడు. పోలీసులు కూడా ఎంత వెతికినా ఆచూకీ దొరకక కేసు పక్కన పెట్టేశారు. కట్ చేస్తే 45 ఏళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా మరో వ్యక్తిలా జీవించింది. ఇటీవల ట్రెండ్ అవుతున్న AI ఫొటో ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. 80ల నాటి ట్రెండ్‌లో తానెలా ఉంటుందో చూసుకోవాలనుకుని AIతో ఓ ఫొటో తయారు చేసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను 45 ఏళ్ల క్రితం ఆ బంగారు హారం దొంగిలించబడిన దుకాణం యజమాని సోషల్ మీడియాలో చూడటమే కాకుండా గుర్తు పట్టడమే అసలు ట్విస్ట్. ఆమె ముఖం గుర్తు లేకపోయినా, హారం గుర్తుండటంతో ఆ ఫొటో చూసి ఇట్టే పట్టేశాడు. తిరిగి పోలీసులను ఆశ్రయించడంతో ఆమె పట్టుబడింది. తమదైన శైలిలో విచారించిన పోలీసుల ముందు 45 ఏళ్ల క్రితం జరిగిన ఆ దొంగతనాన్ని ఆమె ఒప్పుకుంది. ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుని థెఫ్ట్ బయటపెట్టుకున్న ఆమె 4 దశాబ్దాల తర్వాత పట్టుబడటం విశేషం.
Ujjain
Ujjain Crime
45 Year Old Theft
Jewellery Theft
Gold Necklace
AI Photo
AI Trend
1980s Trend
Social Media Trend
సోషల్ మీడియా ట్రెండ్
పాత కేసు
పోలీసుల దర్యాప్తు
మధ్యప్రదేశ్ వార్తలు
క్రైమ్ వార్తలు
Scroll for the next article