News13th May 05:11 PMSunil Byrisetty1 min read
రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధం
రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరుచేసేందుకు ప్రతికంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని రాష్ట్ర విద
రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరుచేసేందుకు ప్రతికంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఉండవల్లి నివాసంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో లోకేష్ సమీక్షించారు.
విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా, ఐటి హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తిచూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ ఇప్పటివరకు 91 ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.
వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరుచేయాలని, సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటుచేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
అయిదేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు.