Politics24th Oct 05:58 PMSunil Byrisetty1 min read
ఏపీలో మజ్లిస్ ఎంట్రీ.. మున్సిపల్ లో పోటీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీలో నిలిచింది. ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ, దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీలో నిలిచింది. ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకునే మజ్లిస్ పార్టీ, దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని పోటీ చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కడప, హిందూపురం, విజయవాడలో పోటీ చేస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కడప మేయర్, హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవులకు అభ్యర్ధులను ప్రకటించారు. అలాగే విజయవాడలో-3 డివిజన్లు, ఆదోని-7, రాయదుర్గం-3, నంద్యాల-1, పెనుగొండ-1 వార్డుల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలో దించారు. హైదరాబాద్ నుంచి మజ్లీస్ ఎమ్మెల్యేలు వచ్చి వీరి తరపున ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆంధ్రాలో కూడా పలు జిల్లాలో ముస్లిం జనాభా ఉంది. కనుక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కట్టడి చేస్తున్న మజ్లీస్ పార్టీ, ఏపీలో కూడా బలపడితే భవిష్యత్‌లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలనుఅదేవిధంగా మజ్లీస్ కట్టడి చేయగలుగుతుంది.