Spiritual14th Oct 03:28 PMSunil Byrisetty1 min read
దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. “పోలీసు శాఖలో కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నాం” అని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో సంప్రదాయ పోలీసు బందోబస్తుతోపాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏఐ ఆధారిత రద్దీ విశ్లేషణ ద్వారా భక్తుల రాకపోకలను అంచనా వేయడం, రద్దీ పెరిగే ప్రాంతాలను గుర్తించడం, అవసరమైన చోట్ల సిబ్బందిని అప్రమత్తం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టారు. కొండపై, ఘాట్‌రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నారు. డ్రోన్ల నుంచి అందే దృశ్యాలను కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానించి పరిస్థితులను సమీక్షించేలా ఏర్పాట్లు చేశారు. రద్దీ పెరిగినప్పుడు సంబంధిత అధికారులు త్వరితగతిన స్పందించేందుకు ఈ వ్యవస్థలు తోడ్పడనున్నాయి.