News1st Jan 12:45 PMSunil Byrisetty1 min read
ఎయిర్ కనెక్టివిటీ సూపర్.. రెండు గ్రీన్ ఫీల్డ్!
ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు హయాంలోనే రూపకల్పన జరిగింది. హైదరాబాద్ వెలుపల ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ అవసరమా అంటూ చంద్రబాబుపై
ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు హయాంలోనే రూపకల్పన జరిగింది. హైదరాబాద్ వెలుపల ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ అవసరమా అంటూ చంద్రబాబుపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయినా , వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి , నిధులు పట్టుబట్టి మరీ సాధించి ఏకాభిప్రాయంతో భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించేలా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఏపీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని భావించారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణం కోసం 2016లోనే ప్లాన్ చేసి, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. భూసేకరణ పూర్తి చేసి 2019లో ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించారు. మొత్తంగా 2 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు సిద్ధం కానున్నాయి.