News12th Jun 03:36 PMSunil Byrisetty1 min read
కుప్పకూలిన బోయింగ్.. విమానంలో మాజీ సీఎం?
గుజరాత్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి 242 మంది ప్రయ
గుజరాత్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో దట్టమైన నల్లటిపొగ వ్యాపించింది. మధ్యాహ్నం 1.39 గంటల సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా.. సాంకేతిక లోపంతో కిందికి పడిపోతూ చెట్టును ఢీకొని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లండన్ ప్రయాణం కావడంతో విమానంలో భారీగా ఇంధనం ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు లిస్ట్ ప్రకారం తెలుస్తోంది.