News4th Sep 10:28 AMSunil Byrisetty1 min read
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం!
గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళుతుండగా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాను రెక్కలకు పక్షి
గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి బెంగళూరు వెళుతుండగా టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఫ్యాను రెక్కలకు పక్షి
తగిలింది. ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలెట్ అప్రమత్తం అయ్యారు. చాకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్వేపై సేఫ్ లాండింగ్ చేశారు. విమానంలో వందమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానంలో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి సుమారు 2, 3 గంటలు సమయం పడుతుందని తెలుస్తోంది. బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ను అధికారులు ఏర్పాటు చేశారు.