National13th Jun 11:10 AMSunil Byrisetty1 min read
11ఏ ప్రాణాలు కాపాడిందా? ఎమర్జెన్సీలో.. !
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాత పడగా ఒకరు మాత్రం తప్పించుకున్నారు. ఒక్క విశ్వాస్ కుమార్ రమేశ్ (40) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాత పడగా ఒకరు మాత్రం తప్పించుకున్నారు. ఒక్క విశ్వాస్ కుమార్ రమేశ్ (40) మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్, ప్రమాదం జరిగిన క్షణాల్లోనే తన ముందున్న ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. సాధారణంగా 11A సీటుకు కిటికీ ఉండదు కాబట్టి.. ప్రయాణికులు ఆ సీటును ఎంచుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ అదే సీటు విశ్వాస్‌కు ప్రాణాలను నిలబెట్టింది.