Entertainment10th Dec 11:46 AMSunil Byrisetty1 min read
అఖండకు లైన్ క్లియర్.. రేపే ప్రీమియర్స్
బాలకృష్ణ 'అఖండ 2' సినిమా విడుదలకు సిద్ధమైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన సినిమా అడ్డంకులను అధిగమించి 12న విడుదల కానుంది. అంతేకాకుండా, ఒకరోజు ముందుగానే అంటే 11న రాత్రి 9 గంటలకు తెలు
బాలకృష్ణ 'అఖండ 2' సినిమా విడుదలకు సిద్ధమైంది. వివిధ కారణాలతో వాయిదా పడిన సినిమా అడ్డంకులను అధిగమించి 12న విడుదల కానుంది. అంతేకాకుండా, ఒకరోజు ముందుగానే అంటే 11న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. థియేటర్ల తుది జాబితాను ఈ రాత్రి లేదా రేపు ప్రకటించనున్నట్లు మోక్ష మూవీస్ ప్రకటించింది. డిసెంబర్ 11న యూఎస్‌ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉంటాయని వెల్లడించింది. మరోవైపు బాలయ్య అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అఖండ 2 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.