News26th Jun 03:41 PMSunil Byrisetty1 min read

అట్టహాసంగా అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన

రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స

అట్టహాసంగా అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన
రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.తొలుత సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు. 2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి అయి పర్యాటకులకు అందుబాటులోకి రానుందన్నారు. తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందన్నారు.
Andhra Pradesh news
east godavari
Akhanda Godavari project
pawan kalyan
minister gajendra
పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన
అఖండ గోదావరి
Scroll for the next article