Entertainment8th Dec 03:54 PMSunil Byrisetty1 min read
ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియో
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాంమని ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో అక్కినేని నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాంమని ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందిని.. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ చదివానని, అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని.. అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు. అయితే కొత్తగా ప్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా లేకపోతే.. పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు. హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచరీ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. హిల్ట్ పాలసీ ప్రకారం.. ప్రభుత్వం .. ఓ పర్పస్ కోసం కేటాయించిన భూములు అంటే.. ఫ్యాక్టరీ లేదా సినీ స్టూడియో వంటి వాటికి కేటాయించిన భూములు వాటికే వినియోగించాలి. ఇతర వాటికి అనుమతి లేదు.