Politics12th Nov 05:39 PMSunil Byrisetty1 min read
విజయసాయి పార్టీలో నందమూరి ఫ్యామిలీ!
విజయసాయి కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన కంటే అలేఖ్య
విజయసాయి కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన కంటే అలేఖ్యరెడ్డి హాజరు వెనుక కారణాలపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఆమె విజయసాయిరెడ్డి పార్టీలో ఏదైనా కీలక పాత్ర పోషించబోతున్నారా? లేక బంధువు అయిన విజయసాయిరెడ్డి వెంట ఈ కార్యక్రమానికి హాజరయ్యారా? విజయ సాయిరెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్మాయ పార్టీగా ఎదుగుతానని ప్రకటించిన విజయసాయిరెడ్డి తన పార్టీకి వెన్నుదన్నుగా కొత్త తరానికి బదులు మిగతా పార్టీల్లోని నేతలనే ముందుగా ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వైసీపీ అసంతృప్తులకు భారీ ఆఫర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి టీడీపీని వదులుతాడా? అన్న చర్చ కూడా జరుగుతోంది.