News25th Apr 04:05 PMSunil Byrisetty1 min read
ఐదు రోజులు మంటలే.. ఎండలో జాగ్రత్త!
సూర్యుడు శివాలెత్తిపోతున్నాడు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. శన
సూర్యుడు శివాలెత్తిపోతున్నాడు.
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.
రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదవుతాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని ప్రకటించింది.
ఇక శుక్రవారం పార్వతీపురం మన్యంలో 8 మండలాలు, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లే వాళ్లు అత్యవసరమైతేనే వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.