News15th Aug 04:08 PMSunil Byrisetty1 min read

పెన్షనర్లకు అలర్ట్.. అనర్హుల ఏరివేత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి

పెన్షనర్లకు అలర్ట్.. అనర్హుల ఏరివేత
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దీంతో అనర్హులు ఎవరైనా ఉంటే తొలగించి, వారి స్థానంలో అర్హులకు పింఛన్లు జారీ చేయనున్నారు.
Andhra Pradesh
Pension Scheme
Disability Pension
Ineligible Removal
Welfare Schemes
Disability Certificate
Pension Eligibility
పెన్షన్ పథకం అనర్హుల తొలగింపు
వికలాంగుల పెన్షన్
Scroll for the next article