News8th Nov 05:00 PMSunil Byrisetty1 min read
పథకాల స్ఫూర్తికి అనుగుణంగా అభివృద్ధి అడుగులు..
పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని.. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల విక
పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థంచేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రధానమని.. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలుకావాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు.
శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి వైద్య ఆరోగ్యం, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్‌లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జననీ సురక్షా యోజన (జేఎస్‌వై), జననీ శిశు సంరక్ష కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించి, పురోగతికి అవసరమైన కార్యాచరణపై సూచనలు చేశారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లోనూ మరింత చొరవ చూపాలన్నారు. జననీ సురక్షా యోజన ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,685 మందికి, పట్టణ ప్రాంతాల్లో 924 మందికి లబ్ధి చేకూరిందన్నారు.