News16th Sep 01:27 PMSunil Byrisetty1 min read
మనమిత్ర నుంచే సర్టిఫికెట్లు డౌన్ లోడు
ప్రజలెవ్వరూ కూడా సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సర్టిఫికెట్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే డౌన్ లోడు చేసుకునే విధంగా ప్రజలకు తెలియజెప్ప
ప్రజలెవ్వరూ కూడా సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సర్టిఫికెట్లు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే డౌన్ లోడు చేసుకునే విధంగా ప్రజలకు తెలియజెప్పాలని ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని జిల్లా కలెక్టర్లకు సూచించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అద్భుతమైన సాధనమని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చేయడంలో జిల్లా కలెక్టర్లే కీలకపాత్ర పోషించాలన్నారు. క్యాస్ట్, నేటివిటీ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు ఇతరత్రా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, దయచేసి సర్టిఫికెట్ల జారీ కోసం ప్రజలను ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించుకోకండని ఆయన కోరారు. ఇప్పటికీ కూడా చాలా మంది అధికారులు సర్టిఫికెట్ల జారీ కోసం ప్రజలను కార్యాలయాలకు పిలిపించుకుంటున్నారని ఇది సరికాదన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లోని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్‌లోనే ఎలాంటి బ్బందుఇలు లేకుండా సర్టిఫికెట్ డౌన్ లోడు చేసుకోవచ్చన్నారు.