News21st Aug 09:52 AMSunil Byrisetty1 min read
2029 కల్లా పేదలందరికీ ఇళ్లు
రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. సచివాలయంలో పురప
రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలు, ప్రగతిలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2.81 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, వచ్చే నెల 15 కల్లా 3.00 లక్షల గృహాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వీటితో పాటు పి.ఎం.ఏ.వై.-2 లో భాగంగా అర్బన్ లో మంజూరు చేయబడిన 40 వేల గృహాలకు మంజూరు ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు మరో 2.00 లక్షల గృహాలు అంటే గృహా నిర్మాణ శాఖకు చెందిన మరో లక్ష ఇళ్లు, మరో లక్ష టిడ్కో గృహాలను సంక్రాతికల్లా అందజేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఇవి కాక పి.ఎం.ఏ.వై.-1.0 లో ఉన్న మరో 5 లక్షల గృహా నిర్మాణాలను రెండో సంవత్సరం పూర్తయ్యేలోపు పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విధంగా రెండేళ్ల కాలంలో దాదాపు 9 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.