News24th Aug 11:50 AMSunil Byrisetty1 min read
నేటి నుంచి ఆలిండియా స్పీకర్ల సదస్సు
అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. 29 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోపాటు ఆ
అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. 29 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోపాటు ఆరు రాష్ట్రాల శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు హాజరయ్యారు. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్పీకర్గా ఎన్నికైన విఠల్బాయి పటేల్ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ ను అమిత్ షా విడుదల చేయనున్నారు. దేశంలో శాసనసభ చరిత్రను తెలియజేసే ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగంతో స్పీకర్ల సదస్సు ముగుస్తుంది.