News3rd Aug 10:37 AMSunil Byrisetty1 min read

కనీస పెన్షన్, హైయర్ పెన్షన్ కోసం చలో ఢిల్లీ

దేశవ్యాప్తంగా ఉన్న 78 లక్షల పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000 వేలు డిఏతో కలిపి చెల్లించాలని, హైయర్ వేతనం పొందిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్లో జరిగే చ

కనీస పెన్షన్, హైయర్ పెన్షన్ కోసం చలో ఢిల్లీ
దేశవ్యాప్తంగా ఉన్న 78 లక్షల పెన్షనర్లకు కనీస పెన్షన్ 9000 వేలు డిఏతో కలిపి చెల్లించాలని, హైయర్ వేతనం పొందిన ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్లో జరిగే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ యుటిఎఫ్ కార్యాలయంలో ఏపీ ఆర్పిఏ రాష్ట్ర కమిటీ సమావేశం ఎన్ఎ శాస్త్రి అధ్యక్షతన జరిగినది. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగుల హక్కుని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల సంక్షేమం మా బాధ్యత కాదని చెప్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు వ్యతిరేకించాలని అందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 25న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాలని, సెప్టెంబర్ 13న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 31 లోపల అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా సదస్సులు నిర్వహించాలని తీర్మానించామని తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే పోరాట కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి ఈపీఎస్ పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
India news
EPS Pensioners
Minimum Pension Demand
Higher Pension Scheme
Chalo Delhi Protest
AP RPA Meeting
UPA Government Policies
Jantar Mantar Protest
Retired Employees Welfare
రిటైర్డ్ ఉద్యోగులు
పెన్షన్ ధర్మా పోరాటం
Scroll for the next article