Spiritual16th Jul 11:28 AMSunil Byrisetty1 min read
పూరీలో రథయాత్రకు సర్వం సిద్ధం
ఒడిశాలో అంగరంగ వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర కోసం సర్వం సిద్ధమైంది. ఆలయంలోని సింహద్వారం వద్ద జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి కోసం రూపొందించిన మూడు రథాలు సిద్ధంగా ఉంచారు
ఒడిశాలో అంగరంగ వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర కోసం సర్వం సిద్ధమైంది. ఆలయంలోని సింహద్వారం వద్ద జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి కోసం రూపొందించిన మూడు రథాలు సిద్ధంగా ఉంచారు.
నందిఘోష - శ్రీ జగన్నాథ స్వామివారి రథం
తాళధ్వజ - బలభద్రుడి రథం
దర్పదళన - సుభద్ర అమ్మవారి రథం
ప్రతి ఏడాది నిర్వహించే ఈ రథయాత్రను లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పూరీకి చేరుకుంటారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పూరీ నగరంలో బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 13,000 మంది పోలీసు సిబ్బంది, 15 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, NSG కమాండోలు, సముద్ర తీరంలో 500 మంది లైఫ్‌గార్డులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఒడిశా మెరైన్ పోలీసు బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.