News20th Jun 05:33 PMSunil Byrisetty1 min read
ఏబీఎస్ ఉంటేనే అనుమతి.. పెరగనున్న బైక్ ధరలు!
ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా, అన్ని రకాల టూవీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ నూతన విధానం
ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా, అన్ని రకాల టూవీలర్లకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ నూతన విధానం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనుంది. ప్రస్తుతం 150 సీసీ పైబడిన ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లకు మాత్రమే ఏబీఎస్ నిబంధన వర్తిస్తోంది. అయితే, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో, ఎంట్రీ లెవల్ మోడళ్లతో సహా అన్ని ద్విచక్ర వాహనాలకు దీనిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుతో, ముఖ్యంగా తక్కువ శ్రేణి బైక్‌ల ధరలు సుమారు రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏబీఎస్ వ్యవస్థ అదనపు ఖర్చుతో కూడుకున్నప్పటికీ, ప్రయాణికుల భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యవసర సమయాల్లో సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా, వాహనం అదుపు తప్పకుండా ఏబీఎస్ నిరోధించి, ప్రమాదాలను తగ్గిస్తుంది.