News10th Sep 04:59 PMSunil Byrisetty1 min read
అవినీతికి కేరాఫ్ గా మంగళగిరి ఎంవీఐ కార్యాలయం
ప్రజలకు సేవలు అందించాల్సిన చోట, ఏజెంట్ల ఆధిపత్యం పెరిగిపోయింది. నేరుగా వెళ్లే సాధారణ వ్యక్తుల పనులు రోజులు, వారాలు పట్టే పరిస్థితి ఏర్పడింది. నేరుగా వెళ్లిన ప్రజల పనులు నిబంధనల పేర
ప్రజలకు సేవలు అందించాల్సిన చోట, ఏజెంట్ల ఆధిపత్యం పెరిగిపోయింది. నేరుగా వెళ్లే సాధారణ వ్యక్తుల పనులు రోజులు, వారాలు పట్టే పరిస్థితి ఏర్పడింది. నేరుగా వెళ్లిన ప్రజల పనులు నిబంధనల పేరుతో అధికారులు చేయడం లేదు. అదే పని కోసం ఏజెంట్ ద్వారా వెళితే క్షణాలలో అధికారులు సంతకాలు చేస్తున్నారు. మంగళగిరి రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి రాజ్యమేలుతోంది. ఎంవీఐ కార్యాలయంలో ప్రతి పనిని ఏజెంట్ల ద్వారా వెళ్తేనే చేస్తున్నారు. ఐదు మండలాలకు చెందిన ప్రజలు అవసరాల నిమిత్తం అక్కడికి రావాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్ తో పాటు పలు పనుల కోసం కార్యాలయానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే పనులను ఏజెంట్ల ద్వారా చేయించుకుంటే గంటల్లోనే పూర్తవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఏజెంట్‌కు డబ్బు ఇస్తే ఫైల్ కదులుతుంది… లేదంటే అదే ఫైల్ రోజులు పడుతుంది” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.