News7th Nov 02:39 PMSunil Byrisetty1 min read

ఇబ్రహీంపట్నంలో కూటమి హవా.. వైసీపీకి నిరాశ!

ఇబ్రహీంపట్నం మండల రాజకీయాల్లో కూటమి పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, ఎన్నికల్లో కూటమి పార్టీలకు వచ్చిన ఫలితాలతో ఎంపీపీ పీఠం కూటమి

ఇబ్రహీంపట్నంలో కూటమి హవా.. వైసీపీకి నిరాశ!
ఇబ్రహీంపట్నం మండల రాజకీయాల్లో కూటమి పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ, ఎన్నికల్లో కూటమి పార్టీలకు వచ్చిన ఫలితాలతో ఎంపీపీ పీఠం కూటమి వశం కానున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రదర్శించిన రాజకీయ చతురత, ఎన్నికల వ్యూహాలు, కూటమి నాయకుల సమన్వయం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మండల పరిధిలో కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడంతో ఎంపీపీ పీఠంపై కూటమి పట్టు బిగించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు నిరాశను మిగిల్చాయి. ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Scroll for the next article