News3rd Jan 06:06 PMSunil Byrisetty1 min read
సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి పాలన
అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సావిత్రభాయి పూలే జయంతి సందర్బంగా విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి మంత్రి సవిత ఘన నివాళులర్పించారు. సావిత్రిభాయిపూలే ఆశయ సాధనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. మహిళలకు ఉన్నత విద్యే లక్ష్యంగా మహిళా యూనివర్శిటీని నెలకొల్పారన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు మహిళలకు రాజకీయ, ఆర్థిక భరోసా కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ఆద్యుడు సీఎం చంద్రబాబు అని మంత్రి సవిత కొనియాడారు.