News25th Oct 04:29 PMSunil Byrisetty1 min read
విజయవాడ వంగవీటి ప్రచారం
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి అభ్యర
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. విజయవాడ అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ సమన్వయంతో పనిచేసే ప్రజాప్రతినిధులు ఉండాలని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సంస్థల స్థాయిలోనూ సమన్వయం తోడైతే నగర అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.