Politics27th Sep 11:36 AMSunil Byrisetty1 min read
కూటమి సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం
కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి క
కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. గత రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయికి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శ్రేణుల మధ్య నిరంతర సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), పార్లమెంటరీ ఎన్నికల ఇన్చార్జ్ మక్కెన మల్లికార్జునరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.