News4th Nov 12:58 PMSunil Byrisetty1 min read
95 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి చారిత్రాత్మక విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి 95 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి 95 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు నారా లోకేష్ ని కలిసి ఘన విజయంపై శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు అందించిన మద్దతుకు నిదర్శనమని పల్లా పేర్కొన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, నాయకుల సమష్టి కృషి, కార్యకర్తల అహర్నిశల శ్రమ ఈ ఘన విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు.