Politics9th Nov 04:51 PMSunil Byrisetty1 min read
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం!
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. 90 శాతం స్ట్రైక్ రేట్ NTR జిల్ల
ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించిందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. 90 శాతం స్ట్రైక్ రేట్ NTR జిల్లాలో టీడీపీ సాధించిందని వివరించారు.
కూటమి నాయకుల సమన్వయంతో అద్భుత ఫలితాలు సాధించామని తెలిపారు. 4 ఓట్ల తేడాతో రెండు ప్రాంతాల్లో ఓడిపోయినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని ఎంపీ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, వైసీపీ ఓటింగ్ శాతం తగ్గితే.. కూటమి ఓటింగ్ శాతం పెరిగిందని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు.