Politics7th Nov 03:26 PMSunil Byrisetty1 min read

పట్టణాల నుంచి పల్లెల వరకు పట్టాభిషేకం

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన విధంగానే, పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని

పట్టణాల నుంచి పల్లెల వరకు పట్టాభిషేకం
మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన విధంగానే, పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజానీకానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏకంగా 2.6 కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు "ఇవి అసలు ఎన్నికలేనా?" అంటూ చులకనగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు, అపోహలు సృష్టించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదని ధ్వజమెత్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిస్తే, ఓటమిని జీర్ణించుకోలేక జగన్ ఈవీఎంలపై నిందలు వేశారని గుర్తుచేశారు. జగన్ కి నిజంగా తన పార్టీని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే.. అధికార పక్షంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆపి, తమ పార్టీ నేతలతో కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
Scroll for the next article