Politics4th Nov 03:20 PMSunil Byrisetty1 min read
కూటమి విజయం ప్రజాతీర్పు కాదు
ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువేంటి ? స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనేదానికి అర్థం
ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువేంటి ? స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనేదానికి అర్థం ఏంటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. ఈ మేరకు టీడీపీ, జనసేన, ఏపీ బీజేపీలను ట్విట్టర్లో ప్రశ్నించారు. మున్సిపల్ ఫలితాల్లో కూటమి పార్టీల విజయం ప్రజా తీర్పు కాదన్నారు. అధికార మదానికి, రాక్షస తత్వానికి తార్కాణమని చెప్పారు. ఇది కూటమి పార్టీల నిజమైన జయభేరి కాదని.. ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు గెలుపని విశ్లేషించారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యున్నత హక్కని, అలాంటి పవిత్రమైన హక్కును అధికార బలంతో కాలరాశారని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘం చేసి,పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని, ఈ దేశ ఎన్నికల వ్యవస్థకే సరికొత్త నిర్వచనం చెప్పారని, దేశం ముంగిట రాష్ట్రం పరువు తీసినందుకు కూటమి పార్టీలు సిగ్గుపడాలని షర్మిల అన్నారు.