Politics15th Oct 03:57 PMSunil Byrisetty1 min read
స్థానిక ఎన్నికల్లో కూటమిదే వంద శాతం విజయం
తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని హార్సిలీ హిల్స్ VSR విండ్ వేవ్ రిసార్ట్‌లో జిల్లాస్థాయి కూటమి నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేల
తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని హార్సిలీ హిల్స్ VSR విండ్ వేవ్ రిసార్ట్‌లో జిల్లాస్థాయి కూటమి నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే 100 శాతం విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, మండలాల వారీగా రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తూ, ఎన్నికల కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు సమష్టిగా కృషి చేస్తూ క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతను బలోపేతం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓట్లు అడిగే హక్కు లేదని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలంటే కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.