News16th Nov 04:23 PMSunil Byrisetty1 min read

రాజధానిలో అన్ని బిసి కులాలకు భూములు కేటాయించాలి

రాజధానిలో బిసిల్లోని అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించి ఆత్మగౌరవ భవానాలను నిర్మించి ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిర

రాజధానిలో అన్ని బిసి కులాలకు భూములు కేటాయించాలి
రాజధానిలో బిసిల్లోని అన్ని సామాజిక వర్గాలకు భూములు కేటాయించి ఆత్మగౌరవ భవానాలను నిర్మించి ఇవ్వాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరిలో జరిగిన కార్తీక వనమహోత్సవంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిపై తన గళాన్ని బలంగా వినిపించారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటింది. 12 ఏళ్లు గడుస్తున్నా, ఇంతవరకు మన రాజధానికి ఒక చట్టబద్ధమైన గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాకపోవడం గత, ప్రస్తుత పాలకుల చేతకానితనానికి నిలువుటద్దం. రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా, పెట్టుబడుల పేరుతో మాయాజాలం సృష్టిస్తూ, ప్రజల భవిష్యత్తుతో, ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముక అయిన బీసీల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు," అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Andhra Pradesh
BC Communities
Capital Land Allocation
Bode Ramachandra Yadav
Political News
Mangalagiri
కార్తీక వనమహోత్సవం
సామాజిక న్యాయం
ఏపీ రాజకీయాలు
భూమి కేటాయింపు సమస్య
Scroll for the next article