Movies5th May 03:45 PMSunil Byrisetty1 min read

శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ

పుష్ప 2 విడుదల సందర్భంగా నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. కాగా, ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను కలిసిన అల్

శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
పుష్ప 2 విడుదల సందర్భంగా నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. కాగా, ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను కలిసిన అల్లు అర్జున్ తండ్రి అరవింద్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ కోలుకోవటం కోసం తమ కుటుంబం అంతా ఎదురుచూస్తోందన్నారు. బాలుడు కోలుకుంటున్న విషయం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికే 2 కోట్లు శ్రీతేజ్ అకౌంట్లో అల్లు అర్జున్, పుష్ప యూనిట్ డిపాజిట్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే శ్రీ తేజ్ కోలుకుని మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Pushpa 2 Sandhya Theater Stampede Incident
Sritej
Allu Aravind
శ్రీతేజ్‌ను అల్లు అరవింద్ నేడు పరామర్శించారు
వైద్యులతో మాట్లాడి
అతని ఆరోగ్య పురోగతిపై పూర్తి సమాచారం
Scroll for the next article