Entertainment1st Oct 04:58 PMSunil Byrisetty1 min read

అల్లు కొత్త ప్రాజెక్టుల కోసం ‘ICONZA’

అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కొత్త ఆఫీస్‌ను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర

అల్లు కొత్త ప్రాజెక్టుల కోసం ‘ICONZA’
అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేశారు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా కొత్త ఆఫీస్‌ను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన చిన్న పోస్టు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. అల్లు అర్జున్‌ చేసిన ఈ ప్రకటనకు అభిమానుల నుంచి స్పందన వస్తోంది. ‘ICONZA’ పేరుతో ఆయన ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నారనే దానిపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతానికి ఆఫీస్‌ ప్రారంభానికి సంబంధించిన వివరాలను మాత్రమే ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Scroll for the next article