Celebrities24th Mar 11:44 AMSunil Byrisetty1 min read

అల్లు అర్జున్ అట్లీ సినిమాకి 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా రెమ్యునరేషన్ కళ్లు చెదిరేలా ఉందని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని అధికారికంగ

అల్లు అర్జున్ అట్లీ సినిమాకి 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా రెమ్యునరేషన్ కళ్లు చెదిరేలా ఉందని టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో అల్లు అర్జున్ ద్విపాత్ర అభినయంలో నటించబోతున్నారని ఒక పాత్ర పాజిటివ్ కాక మరొక పాత్ర నెగిటివ్గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అవుతుంది . ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో వింటే మైండ్ బ్లాక్ అవుతుందంట. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. రెమ్యూనరేషన్ కాకుండా సినిమా లాభాలలో 15% వాటా కూడా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. టాలీవుడ్‌లో అల్లు అర్జు్న్ రెమ్యునరేషన్ హయ్యె్స్ట్ కావొచ్చని చర్చించుకుంటున్నారు.
Tollywood
Allu Arjun
Atlee
త్రివిక్రమ్ శ్రీనివాస్
Scroll for the next article