News15th Apr 09:14 AMSunil Byrisetty1 min read
మెగా, బన్నీ వార్‌కు తెర.. పవన్ ఇంటికి అల్లు అర్జున్!
మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారానికి తెర పడింది. కొన్నేళ్లుగా అల్లు కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ అంశం
మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న ప్రచారానికి తెర పడింది.
కొన్నేళ్లుగా అల్లు కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ అంశంపై అటు అల్లు, ఇటు మెగా కుటుంబాల నుంచి ఎవరూ స్పందించలేదు.
తాజాగా ఆ ఆరోపణలకు చెక్ పెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు.
హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సతీసమేతంగా హీరో అల్లు అర్జున్ దంపతులు వెళ్లి పరామర్శించారు.
పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై బన్నీ, స్నేహ ఆరా తీశారు.
దీంతో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సంకేతాలు ఇచ్చినట్లయింది