Entertainment11th Jul 03:07 PMSunil Byrisetty1 min read
ఏపీలో 'అల్లు అర్జున్' మల్టీఫ్లెక్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ నిర్మాణంలో అడుగు పెట్టారు. విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ మల్టీ ప్లెక్స్ పనులు ప్రారంభించారు. 2023లోనే 13 ఎకరాల్లో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ నిర్మాణంలో అడుగు పెట్టారు. విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో ఆసియన్ అల్లు అర్జున్ మల్టీ ప్లెక్స్ పనులు ప్రారంభించారు. 2023లోనే 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి పునాది వేశారు. విశాఖలో నిర్మించే ఈ మాల్ దక్షిణాదిలోనే అతి పెద్దదిగా ఉండనుంది. పది నెలల్లోనే పనులు మొత్తం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే థియేటర్లో ఇంటీరియర్ డిజైనర్లను అల్లు అర్జున్ స్వయంగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఈ మల్టీ ప్లెక్స్‌కు మరిన్ని సొబగులు అద్దేందుకు విదేశీ ఫర్నిచర్ తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌లో 8 స్క్రీన్స్ ఉండనున్నాయి. 2026 వేసవిలో దీన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.