News24th Apr 11:20 AMSunil Byrisetty1 min read
రాజధానిలో మూడు ఎలివేటెడ్ కారిడార్లు
రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో మూడు ప్రధాన రహదారుల్లో (మేజర్ ఆర్టీరియల్ రోడ్స్) 8 వరుసల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం స
రాజధాని అమరావతికి కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో మూడు ప్రధాన రహదారుల్లో (మేజర్ ఆర్టీరియల్ రోడ్స్) 8 వరుసల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) రూపకల్పనకు అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది.
అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించే E5, E13, N13 రహదారుల్లో వీటిని అభివృద్ధి చేస్తారు.
E-13 రహదారిని చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ADC) ఇప్పటికే టెండర్లు పిలిచింది.
ఈ రహదారుల ద్వారా రాజధానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ ఏర్పడుతుంది.