News13th Mar 03:33 PMSunil Byrisetty1 min read
పల్నాడుకే తలమానికం.. నాగమ్మ శైవ క్షేత్రం
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ శైవ క్షేత్రం పునః ప్రతిష్ఠ జరగనుందని టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఈ నెల 16న జరిగే ఈ ప్రతి
పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ శైవ క్షేత్రం పునః ప్రతిష్ఠ జరగనుందని టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు.
ఈ నెల 16న జరిగే ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు.
ప్రజాహిత కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నాగమ్మ శైవ క్షేత్రం పల్నాడుకే తలమానికంగా నిలవనుందని వివరించారు.
14, 15, 16 తేదీల్లో ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.
నాగమ్మ శైవ క్షేత్రం ఆలయం చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉందని వివరించారు.
నాగమ్మ 12వ శతాబ్దానికి చెందిన రాష్ట్ర ప్రతినిధి అని, పల్నాటి యుద్ధంలో బ్రహ్మ నాయుడుతో పాటు నాగమ్మ కీలక పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు.
ఈ క్షేత్రం పునరుద్ధరణతో పల్నాడు ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు.
ఈ ఆలయం పల్నాడు జిల్లాకి ఒక పర్యాటక ప్రదేశంగా కూడా మారుతుందన్నారు.
ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.