News2nd Dec 11:58 AMSunil Byrisetty1 min read

క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు.. రెండు ఎకరాల్లో భవనాలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలను కేటాయించారు. అందులో రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఎక్యూసిసి) ఏర్పాటు చేయనున్నారు. ఇది జాతీయ సాంకేతిక భవిష్యత్ కేంద్రంగా మా

క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు.. రెండు ఎకరాల్లో భవనాలు
అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలను కేటాయించారు. అందులో రెండు ఎకరాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఎక్యూసిసి) ఏర్పాటు చేయనున్నారు. ఇది జాతీయ సాంకేతిక భవిష్యత్ కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాయపూడి పరిధిలోని సీఆర్డిఎ ప్రధాన కార్యాలయానికి ఉత్తరభాగంలో సీడ్ యాక్సెస్రోడ్డు అవతల దీనిని నిర్మించనున్నారు. క్వాంటం భవన నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. ఈ నెల ఆరోతేదీతో టెండర్ల గడువు ముగియనుంది. ప్రాజెక్టు వ్యాల్యూను పేర్కొనకపోయినా నిర్దేశిత ధరకంటే ఎవరు తక్కువకు టెండర్ వేస్తే వారికి కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం విట్ యూనివర్శిటీలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్లో రాయపూడి వద్ద నిర్మించే శాశ్వత భవనంలోకి దీన్ని మార్చనున్నారు. అనంతరం అమరావతిని పూర్తిస్థాయి క్వాంటం సిటీగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును సీఆర్ డిఎ ఐటీ అండ్ ఈ శాఖ సంయుక్తంగా ఖర్చు చేయనున్నట్లు టెండర్లలో పేర్కొన్నారు. ప్రస్తుత భవనాన్ని జిప్లస్1 అంతస్తుగా 4,201 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్, ఫైర్(ఎంఈపిఎఫ్)తో గ్రీన్ బిల్డింగ్ నిబంధనల ప్రకారం నిర్మించనున్నారు. దీనిలో గ్రౌండ్ ఫ్లోర్ 1,990 చదరపు మీటర్లు, మొదటి ఫ్లోర్ 1,996 చదరపు మీటర్లు, బేస్ మెంట్ 210 చదరపు మీటర్లతో నిర్మించున్నారు. ఇవి కాకుండా హెడ్ రూము 109, డెక్ ఏరియా 130 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
Ap govt
Amaravati
Quantum Valley
Quantum Computing Center
AQCC
CRDA
Rayapudi
Seed Access Road
Quantum City
Building Tenders
Green Building Norms
ఐటీ అండ్ ఈ శాఖ
విట్ యూనివర్శిటీ
భవన నిర్మాణం
Scroll for the next article